దర్బార్ సెన్సార్ టాక్.. రన్‌టైం ఎంతో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రజినీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

 Darbar Movie Completes Censor And Run Time Locked-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు తలైవా రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు రజినీ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారట.పోలీస్ పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా నటించారట రజినీకాంత్.

సినిమాలోని పంచ్ డైలాగులతో థియేటర్‌లలో విజిల్స్ పడటం ఖాయమని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక ఈ సినిమా రన్‌టైంను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా రన్‌టైం 2 గంటల 39 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో రజినీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

తమిళ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube