ఆఫ్గాన్ కాబూల్ లో కర్ఫ్యూ..!!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని కూలదోసి మొత్తం స్వాధీనం చేసుకోవటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.అంతకుముందు తాలిబాన్ల ప్రభావం ఉండగా ఆ సమయంలో నాటో దళాలు రంగంలోకి దిగడంతో అక్కడ పరిస్థితులు మారి ప్రభుత్వం ఏర్పడింది.

 Curfew In Afghan Kabul Afghanisthan, Kabulafghan Kabul , Curfew , Thalibans , S-TeluguStop.com

అయితే నాటో దళాలు క్రమక్రమంగా ఆ దేశాన్ని విడిచి వెళ్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే దేశాన్ని మొత్తాన్ని స్వాధీనం తీసుకున్న తాలిబాన్లు కొంతమంది ప్రభుత్వ పెద్దలను హతమార్చారు.

ఇదే సమయంలో ప్రభుత్వ రూల్స్ మార్చి సరికొత్తగా కఠినమైన షరియా చట్టాలను దేశంలో అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.

తీవ్ర భయాందోళన లో ఉన్నారు.కొంత మంది ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లాలని ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా కాబుల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉండటం తో తాజాగా తాలిబాన్లు కాబూల్ లో కర్ఫ్యూ విధించారు.విమానాశ్రయానికి ప్రజలు భయంకరంగా పోతెత్తుతూ ఉండటంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో.

అక్కడ ప్రభుత్వ అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడం కోసం కర్ఫ్యూ విధించడంతో జరిగింది.ఈ రూల్ తో కాబుల్ ప్రాంతం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube