బిగ్ బాస్ ( Bigg Boss 7 )సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో రతిక రోజ్ ( Rathika Roj ) ఒకరు.హౌస్ లో గ్లామర్ డాల్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి ఈమె మొదటి రెండు వారాలు ఎంతో అద్భుతంగా ఆటను ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే అనంతరం ఈమె పల్లవి ప్రశాంత్ తో ప్రేమలో పడటం తిరిగి ఆయనని మోసం చేయడం అలాగే తన స్వార్థం కోసం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లను వాడుకోవడం వంటి వికృతి చేష్టలు చేశారు.దీంతో ఈమె ఆట తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చకపోవడంతో తనని హౌస్ నుంచి పంపించేశారు.
ఇలా ఈమె హౌస్ లోకి వెళ్లినటువంటి నాలుగవ వారంలోనే బయటకు వచ్చేసారు.
![Telugu Bigg Boss, Chance, Raghavendra Rao, Rathika, Tollywood-Movie Telugu Bigg Boss, Chance, Raghavendra Rao, Rathika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Bigg-boss-Rathika-Movie-chance-Raghavendra-Rao-tollywood.jpg)
చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.అయితే సోషల్ మీడియా వేదికగా రతిక రోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ కార్యక్రమంలో నాలుగు వారాల పాటు కొనసాగినటువంటి ఈమెకు హౌస్ నుంచి బయటకు రాగానే ఒక భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.
ఈమె సినిమాలో ప్రధాన పాత్రలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని స్వయంగా రతిక రోజ్ తెలియజేయడం విశేషం.
![Telugu Bigg Boss, Chance, Raghavendra Rao, Rathika, Tollywood-Movie Telugu Bigg Boss, Chance, Raghavendra Rao, Rathika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Bigg-boss-Rathika-viral-Movie-chance-Social-media-Raghavendra-Rao-tollywood.jpg)
ఇక ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ మరెవరో కాదు సీనియర్ దర్శకుడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు( K.Raghavendra Rao ) తన సినిమాలో ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారని తెలుస్తుంది.ఇలా హౌస్ లో ఉన్నటువంటి నాలుగు వారాలకే రతిక రోజ్ హీరోయిన్గా సినిమా ఛాన్స్ అందుకున్నారనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈమె బయటకు రావడమే మంచి జరిగింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ నుంచి గత మూడు వారాలలో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తుంది మరి అవకాశం ఎవరు అందుకుంటారో తెలియాల్సి ఉంది.