ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి.ఇప్పటికే మార్కెట్ లో కొన్ని వ్యాక్సిన్లను తీసుకొచ్చి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే వీటికి భిన్నంగా ముక్కు ద్వారా అందించే కరోనా వైరస్ వ్యాక్సిన్ ను వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ఎలుకపై సమర్థవంతంగా ప్రయోగించారు.
కరోనా ఇన్ఫెక్షన్ ను సమర్థవంతంగా అరికట్టిందని పరిశోధకులు వెల్లడించారు.
ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపర్చిందని, ముఖ్యంగా శ్వాస మార్గంలో శరీరంలో ఇన్ఫెక్షన్ చేరకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి కరోనా వైరస్ దాడికి కారణమయ్యే వైరస్ స్పైక్ ప్రోటీన్ ను జలుబుకు కారణమయ్యే అడినో వైరస్ లోకి జొప్పించారు.ఆడినో వైరస్ స్పైక్ ప్రొటీన్ ను ముక్కు ద్వారా తీసుకెళ్లి కరోనా బారిన పడకుండా చేస్తుందని గుర్తించారు.
ఎలుకల్లో నాసల్ డ్రాప్స్, ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇవ్వగా ఇంజెక్షన్ న్యూమోనియాను నిరోధించింది కానీ, ముక్కు ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ ను నిరోధించలేదన్నారు.కానీ ముక్కు ద్వారా పంపిన వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందన్నారు.
ఈ మేరకు తర్వాతి దశలో కోతులపై ప్రయోగించి ఆ తర్వాత మనుషులపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తామని పరిశోధకులు వెల్లడించారు.