తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల దూకుడు పెంచారు.ఆమె తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు ? అక్కడ రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటన చేసిన వెంటనే తెలంగాణ రాజకీయాలు ఎలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో ఒక్క సారిగా గుబులు రేపింది.కొందరు అయితే షర్మిల కొత్త పార్టీ వెనక కేసీఆర్ ఉన్నారన్న సందేహాలు వ్యక్తం చేస్తే.మరి కొందరు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే షర్మిల వెనకాల ఉండి కొత్త పార్టీ పెట్టించిందని.వచ్చే ఎన్నికల్లో షర్మిల- బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న సందేహాలు వ్యక్తం చేశారు.
ముందుగా షర్మిల ఈ నెల 9న ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.ఆ తర్వాత ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమయ్యారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటించాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది.ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ఆమె బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో తన నివాసానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఆమెను పలువురు మాజీ ప్రతినిధులు.ఒకప్పుడు కీలక నేతలుగా ఉన్న వారు కలుసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది.

షర్మిలతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి భేటీ అయ్యారు.మర్యాద పూర్వకంగానే భేటీ అయినట్లు ఆయన చెప్పినప్పటికీ పూర్తిగా రాజకీయ అంశాలే ఈ భేటీలో చర్చకొచ్చినట్లు సమాచారం.షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది.ఇక గతంలో తెలంగాణలో వైఎస్ అనుచరులుగా పేరు ఉండడంతో పాటు తమ కుటుంబానికి ఎంతో విధేయులుగా ఉన్న నేతలకే షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంచుకోవడం వెనక కూడా రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉండేలా చూసుకునే ప్లానే అంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెడ్డి వర్గాన్ని షర్మిల పూర్తిగా తన వైపునకు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారని.
ఇతర పార్టీల్లో ప్రాధాన్యం లేని రెడ్డి నేతలు ఆమె పార్టీలోకే వెళతారని కూడా అంటున్నారు.మరి ఏం జరుగుతుందో ? చూడాలి.