ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులకు సంబంధించి అధికారులు కొద్దిరోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు.అంతేకాక ఈ నెల 23వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టిఆర్ఎస్ లో కీలకంగా ఉంటూ, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త గా గుర్తింపు పొందిన నామా నాగేశ్వరరావు గతంలో టిడిపి ఎంపీగా పనిచేశారు.తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిడిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం , ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో నాగేశ్వరావు టిఆర్ఎస్ లో చేరడం, ఖమ్మం ఎంపీగా పోటీచేసి గెలవడం జరిగాయి.
ఆయనకు సంబంధించిన ఆర్థిక , వ్యాపార వ్యవహారాలతో 2019 లోనే ఈడి అధికారులు కేసు నమోదు చేశారు.అయితే టిఆర్ఎస్ నేతలను ఒక్కసారిగా బీజేపీ టార్గెట్ చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.
దానిలో భాగంగానే నామా నాగేశ్వరరావు కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు స్పీడ్ పెంచింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ కారణంగానే ఈ దాడులు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న నేతల లిస్ట్ బీజేపీ నేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈటెల రాజేందర్ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, మొన్నటివరకు మంత్రివర్గంలో కొనసాగడం తదితర కారణాలతో టిఆర్ఎస్ నాయకుల వ్యవహారాల గురించి రాజేందర్ కు బాగా తెలుసు.
ఆయన సిఫార్సు మేరకు తెలంగాణలో బిజెపి బలపడాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక అండ దండలు టిఆర్ఎస్ కు అందకుండా చేయాలనే విషయాన్ని రాజేందర్ బిజెపి నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

నామా పై దాడులు జస్ట్ శాంపిల్ మాత్రమేనని ముందు ముందు మరిన్ని దాడులు టిఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు గా గుసగుసలు మొదలయ్యాయి.గత ఏడేళ్లుగా టిఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న వారి లిస్ట్ ను ప్రత్యేకంగా బీజేపీ పెద్దలకు రాజేందర్ అందించారు అనే విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది.టీఆర్ఎస్ నేతల్లో క్రమంగా ఆందోళన పెరిగేలా చేసి, ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేసే విధంగా చేసే ఆలోచనతోనే ఈ వ్యవహారాలకు తెర తీశారు అనే చర్చా నడుస్తోంది.
మరి అదే నిజం అయితే ‘ నామా ‘ తరువాత ఆ లిస్ట్ లో ఉంది ఎవరో.