ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై రెండు రోజుల క్రితం జరిగిన రాయి దాడి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వచ్చేనెల 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో.
జగన్ పై రాయి దాడి జరగడం, ఆయన కు బలమైన గాయం కావడంతో జనాల్లో దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో జగన్ పై దాడి జరిగింది.
దానిపై జనాల్లో పెద్దగా స్పందన లేకపోయినా, దానికి సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ అవడం, జగన్ లక్ష్యంగా చేసుకుని ఎవరో కావాలని చేశారనే అభిప్రాయం జనాల్లో కలగడం, ఇవన్నీ ఆ పార్టీకి కలిసి వచ్చాయి.ఇప్పుడు ఇదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ పై రాయి దాడి జరగడంతో , దీనిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతుంది.
ఇప్పటికే వలంటీర్ల విషయంలో విపక్ష పార్టీల తీరు పై జనాల్లో ఒక రకమైన ఆగ్రహం కనిపిస్తుండగా, ఇప్పుడు విపక్ష పార్టీలే జగన్ పై రాళ్ళ దాడి చేయించయనే ప్రచారం జరుగుతుంది.అయితే ఎన్నికల పోలింగ్ కు నెల రోజుల సమయం ఉండడంతో, జనాలు ఈ ఘటనను మర్చిపోతారని, వైసీపీకి అది కలిసి రాదని విపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి.కానీ ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని, ఇప్పటికే విపక్ష పార్టీల తీరుపై జనాల్లో ఆగ్రహం ఉందని, ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ పై ఈ విధంగా రాళ్లదాడి విపక్ష పార్టీలే చేయించాయని, కచ్చితంగా ఇది తమకు సానుభూతి తీసుకొస్తుందనే అభిప్రాయం వైసిపి నేతల్లో కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని టిడిపి( TDP ) సైతం గుర్తించినట్టుగా కనిపిస్తోంది.అందుకే జగన్ పై రాళ్ల దాడికి పాల్పడిన నిందితులు ఎవరో తేల్చాలని, దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.జగన్ పై దాడి జరిగితే అది సానుభూతిగా మారి వైసిపికి కలిసి వస్తుందనే విషయం తమకు తెలియదా అని , తామెందుకు ఈ రాళ్ల దాడి చేయిస్తామని కొంతమంది టీడీపీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు మొత్తంగా చూస్తే జగన్ పై జరిగిన రాళ్ల దాడి వ్యవహారం వైసిపికి కలిసివచ్చే విధంగా కనిపిస్తోంది.
విపక్షాలను టార్గెట్ చేసుకునేందుకు జనంలో దీనిపై మరింత విస్తృతంగా చర్చ జరిగే విధంగా చేసుకునేలా వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.