ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తన పనితీరు పట్ల ప్రజలు 60 శాతం సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో… వైయస్ జగన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని, గెలవరు అనే వారిని పక్కన పెట్టేస్తాం అని తేల్చి చెప్పారు.ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ గ్రాఫ్ పరీక్షించుకోవాలని సూచించారు.
పార్టీ మొత్తం గా 100% గ్రాఫ్ చూసుకుంటే అందులో 60 శాతం.నా పని తీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మిగతా 40 శాతం మీ పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరే తేల్చుకోవాలి.2024 ఎన్నికలలో మాత్రం గెలిచే వారికే టికెట్లు ఇస్తామని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… పార్టీ ఎమ్మెల్యేలకు వైయస్ జగన్ పలు సూచనలు ఇవ్వడం జరిగింది.