టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలే తీసుకున్నారు .ఇప్పటి వరకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు రావడం వంటివి జరిగాయి .
ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయానికి వస్తే , తెలంగాణలో ఎన్నికల ప్రచార గడువు ముగియడం, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పవన్ కూడా పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.ఈ మేరకు పవన్, చంద్రబాబు ఉమ్మడిగా ఏపీలో రాజకీయ సభలు , సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించారు.
వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తమ రెండు పార్టీలు వస్తే .ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ? ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అనే విషయాలపై ఇరు పార్టీల అధినేతలు తీసుకున్నారు.

రెండు పార్టీలు ఉమ్మడి కార్యచరణను రూపొందించుకునే పనుల్లో నిమగ్నం అయ్యాయి.ఏపీలో జగన్( Jagan ) ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.అంతేకాదు తమతో బీజేపీ కూడా కలిసి రావాలని రెండు పార్టీలు కోరుతున్నా, బిజెపి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే బీజేపీ విషయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పవన్ చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్ర ( Siddhartha Ludra )కుమారుడి వివాహ రిసెప్షన్ పాల్గొనే నిమిత్తం ఢిల్లీకి( Delhi ) వెళ్లారు.
ఈనెల 30 తిరుమలలో అక్కడ బస చేసి ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న ను దర్శించుకోవాలని బాబు నిర్ణయించుకున్నారు.

ఇక తర్వాత పూర్తిగా జనం బాట పట్టనున్నారు.ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు.డిసెంబర్ లో లోకేష్ పాదయాత్ర ముగియనుంది.లోకేష్ పాదయాత్ర ముగిసే నాటికి కోస్తా, రాయలసీమలో బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచనతో చంద్రబాబు పవన్ ఉన్నారట. ఇక టిడిపి , జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 25 నుంచి 30 స్థానాలను కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారట .జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాల జాబితాను జనవరిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.