కశ్మీర్‌పై కాంగ్రెస్ ఫోకస్..?

Congress Focus On Kashmir, RAHUL GANDHI, AICC PRECIDENT MALLIKHARJUNA KHARGE, NATIONAL CONFARENCE, PDP, MEHABUBA MUFTHI, RAHUL JODO YATRA, BJP

పోయిన సారి లోక్ సభ ఎన్నికల్లో చతికిలా పడిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా మెరుగు పడాలని భావిస్తోంది.అందులో భాగంగా.

 Congress Focus On Kashmir, Rahul Gandhi, Aicc Precident Mallikharjuna Kharge, Na-TeluguStop.com

పార్టీలని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేస్తు వస్తోంది.చాలా రాష్ట్రాల్లో నేతల మధ్య లోపించిన సఖ్యతను తిరిగి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోంది.

సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే.యువతను ప్రోత్సహిస్తోంది.

రాష్ట్రాల్లో సైతం యువతకు ప్రాధాన్యత ఇస్తూ.పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది.

దానికోసం రాహుల్ గాంధీ ఏకంగా పాదయాత్ర మొదలు పెట్టారు.కన్యాకుమారి నుంచి మొదలు పెట్టి కశ్మీర్ లో యాత్రను ముగించనున్నారు.

Telugu Mehabuba Mufthi, Rahul Gandhi-Politics

ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగియనుంది.దానికోసం భారీ స్థాయిలో మంతనాలు మొదలయ్యాయి.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.దేశంలోని బావ సారూప్యత కలిగిన పార్టీలన్నిటికీ లేఖలు రాశారు.అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో పాగా వేసిన కాంగ్రెస్ కన్ను ఇప్పుడు కశ్మీర్ పై పడింది.

ఈ సారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.అక్కడ పాగా వేయాలని పిక్స్ అయింది.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు.బీజేపీ కావాలనే, గులాం నబీ ఆజాద్ చేత పార్టీ పెట్టించిందని విమర్శకులు చెబుతున్నారు.

Telugu Mehabuba Mufthi, Rahul Gandhi-Politics

బీజేపీ ప్లాన్ ను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ కూడా రాజకీయం మొదలు పెట్టింది.కశ్మీర్లో పట్టు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను తమ వైపు తిప్పుకున్నారు.నెహ్రూకాలం నుంచి అబ్దుల్లాలకు.కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధం ఉంది.మధ్యలో రెండు పార్టీలకు చెడిపోయింది.దాంతో రంగంలోకి దిగిన రాహుల్ వారిని బుజ్జగించి.

తమతో నడిపించుకున్నారు.రాహుల్ యాత్రలో ఏకంగా ఓమర్ అబ్దుల్లా వచ్చి.

నడిచాడు.ఈ సారి కశ్మీర్ పై ఎలాగైనా కాంగ్రెస్ జెండా పాతాలని అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ వల్ల అటు పీడీపీ, ఇటు ఎన్సీపీలు భారీగా దెబ్బతిన్నాయి.కాన్ఫరెన్స్ తో పాటు, ముఫ్తీతో కూడా పొత్తు పెట్టుకుంటే.

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవచ్చు అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.మరి వారి కల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube