తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.ఏకంగా ఆరు రోజుల పాటు ఢిల్లీలో ఆయన పర్యటన చేపట్టడంతో.
కెసిఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తో పాటు కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అవ్వగా నేడు రాష్ట్రపతితో భేటీ కాబోతున్నారు.
ఈరోజు ఆరో రోజు పర్యటన కావటంతో రాష్ట్రపతితో పాటు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కెసిఆర్భే టీ కానున్నట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర సమస్యలను ప్రధాని మోడీ కి అదే రీతిలో మరికొంతమంది మంత్రులకు తెలియజేసిన కేసీఆర్ నేడు.
జలశక్తి మంత్రి తో కి కూడా వివరించినట్లు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి సమస్యల విషయంలో.త్వరగా పరిష్కారం చూపే దిశగా కేంద్రం అడుగులు వేయాలని కోరనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు సంబంధించి కెసిఆర్ చర్చించనున్నట్లు సమాచారం.ప్రధాని మోడీ తో భేటీ అయిన సమయంలో రాష్ట్రానికి సంబంధించి 16 అంశాల వినతిపత్రాన్ని అందించారు.
ఈ క్రమంలో నేడు రాష్ట్రపతితో పాటు జలశక్తి మంత్రితో కెసిఆర్ భేటీ కావడం సంచలనంగా మారింది.