గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ‘ఇగురం’ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిసిన గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తుపట్టి అభినందించండం సంతోషాన్ని కలుగ జేసిందని రచయిత పేర్కొన్నారు.
అంతే కాకుండా సియం తన పుస్తకాన్ని చదవడం జరిగిందని చెప్పడం చాలా బాగా రాసావంటు కీప్ రైటింగ్ అని అభినందించడం ఆనందదాయకం అన్నారు.
తన తొలి పుస్తకం ఇగురం సీఎం కేసీఆర్ వరకూ చేరడం, ఆయన దాన్ని చదవడం అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.
ఈ సందర్బంగా సీఎంను కలువడానికి కారణమైన రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ అభినందించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మానేరు గడ్డపై పుట్టడం, హైదరాబాద్ విభిన్న సంసృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంభనమన్నారు.
మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డి.
.