ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( CM YS jagan ) తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
సోమవారం 11 నియోజకవర్గాలకు సంబంధించి.కొత్త ఇన్చార్జిలను నియమించడం జరిగింది.
ఒక్కసారిగా జగన్ ఈ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.ఇదంతా పక్కన పెడితే ఏపీ రాజకీయాలలో బైరెడ్డి సిద్ధార్ రెడ్డి అందరికీ సుపరిచితుడే.
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రాణిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీని నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు.ఉపాధ్యక్షుడిగా కొండా రాజీవ్ గాంధీ, పిన్నెలి వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.వైసీపీ యువజన విభాగంలో 64 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది.దీనిలో భాగంగా.
శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి( Byreddy Siddhartha Reddy )కి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం.వైసీపీ పార్టీలో సంచలనంగా మారింది.
వచ్చే ఎన్నికలను జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలలో ఉండేవిధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.