దేశంలో చాలామంది దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది.అయితే ఆ డబ్బులో కొంత మొత్తాన్ని సహాయం చేసే గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది.
అలా సహాయం చేసే గుణం ఉన్నవాళ్లలో రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )ఒకరు.ఒకప్పుడు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ఒక వెలుగు వెలిగిన లారెన్స్ ప్రస్తుతం హీరోగా, డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తూ మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
కాంచన సిరీస్( Kanchana series ) లో భాగంగా తెరకెక్కిన లారెన్స్ సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాయి.చంద్రముఖి2 సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నా ఆ ప్రభావం లారెన్స్ కెరీర్ పై పెద్దగా పడలేదు.ఎంతోమంది టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోల ఫేవరెట్ కొరియోగ్రాఫర్లలో లారెన్స్ ఒకరు కాగా ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానున్న దసరా ఈవెంట్ కు లారెన్స్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోలో లారెన్స్ మాట్లాడుతూ తను సంపాదించిన డబ్బుతో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు( Open heart surgeries ) చేయిస్తానని స్కూల్ పిల్లలకు ఫీజు కడతానని లారెన్స్ తెలిపారు.ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైపర్ ఆది దృష్టికి తీసుకొనిరావాలని హైపర్ ఆది తనకు సమాచారం ఇస్తే తాను వైద్య చికిత్స చేయిస్తానని లారెన్స్ అన్నారు.లారెన్స్ మనుషుల్లో దేవుడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వేల రూపాయలు దానం చేయడానికి కూడా బాధ పడుతుంటే లారెన్స్ మాత్రం తన మంచితనంతో ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తున్నారు.లారెన్స్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
లారెన్స్ కు కెరీర్ పరంగా భారీ సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎంత ఎదిగినా సింపుల్ గా ఉంటున్న లారెన్స్ తన మంచి మనస్సుతో ప్రశంసలు అందుకుంటున్నారు.