బతుకమ్మ పాటలతో.. మారుమోగుతున్న వేములవాడ పరిసర ప్రాంతాలు!

వేములవాడలో ఆకాశాన్ని అంటిన పూల పండుగ జాతర!కనీవిని ఎరుగని రీతిలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది జనం రాజన్న సిరిసిల్ల జిల్లా :నేడు ఆధ్యాత్మిక క్షేత్రంలో అంబరాన్నింటిన సద్దుల బతుకమ్మ సంబురాలు.ఊరువాడా.

 With The Songs Of Bathukamma The Surrounding Areas Of Vemulawada Are Resounding-TeluguStop.com

రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు.

పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు.అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.

బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్, రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్ దగ్గర ఉండి బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బతుకమ్మ వేడుకలు సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొన్నన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube