ఆచార్య రిలీజ్ పై నోరు విప్పిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఆచార్య సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Chiranjeevi Speaks About Acharya Release , Acharya,chiranjeevi, Ram Charan, Kaja-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు ఆచార్య రిలీజ్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మే లోనే విడుదల చేస్తున్నామని ప్రకటించినా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆచార్య దసరా కానుకగా వస్తుందని అంత భావించినా ఏ విషయం కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ పై మెగాస్టార్ నోరు విప్పారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడాడు.ఈ క్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ ముందుగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత టాలీవుడ్ ఎదుర్కుంటున్న ఇష్యుపై మాట్లాడారు.రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మారుతున్న నేపథ్యంలో టాలీవుడ్ పరిశ్రమను ఆదుకోవాలని ఆయన తెలిపారు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrwal, Love Story Pre, Pooja Hegde, Ram Char

అంతేకాదు టాలీవుడ్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రెసెంట్ సినిమా బడ్జెట్ తో పాటు కాస్ట్ కూడా పెరిగింది.అలా కాకుండా నటీనటులందరూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అలా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని అలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తులు చాలా కొద్దీ మంది మాత్రమేనని అందుకే అందరి కోసం అలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని లేకపోతే ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతారని ఆయన తెలిపారు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrwal, Love Story Pre, Pooja Hegde, Ram Char

అంతేకాదు ఈ ఇష్యుల కారణంగానే ఆచార్య సినిమాను రిలీజ్ చేయడం లేదని తెలిపారు.కొత్త నిర్ణయాల కారణంగా బడ్జెట్ అంతా వస్తుందో లేదో అనే ఆందోళన అందరిలో నెలకొందని అందుకే సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.సినీ పరిశ్రమ ఎప్పుడు ప్రేక్షకులను అలరించాలనే కోరుకుంటాం అని దేశంలో ఏదైనా ఆపద వచ్చిన కూడా ముందుగా స్పదించేది సినీ పరిశ్రమనే అని అందుకే అలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇది తన విన్నపంగా భావించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube