మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తరువాత తన 152వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ఇటీవల ప్రారంభించారు.
కాగా మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ 152వ చిత్రాన్ని దసరా బరిలో దించేందుకు దర్శకుడు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.సోషల్ మెసేజ్ చిత్రంగా ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడు.
అటు బాలయ్యతో బోయపాటి సినిమా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇదే జరిగితే ఈ ఏడాది దసరాకు ఇద్దరు స్టార్ హీరోల మధ్య వార్ జరగడం ఖాయమని అంటున్నారు సినీ జనం.గతంలో 2017 సంక్రాంతికి ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.
చిరు 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, బాలయ్య హిస్టారికల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.
ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.మరి ఈ దసరాకు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా-నేనా అనే రీతిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటే ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.