నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్, షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు.
ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయంలో బోయపాటి తీవ్రంగా కష్టపడుతున్నాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు చేస్తున్నారనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా కేథరిన్ త్రేసాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆమె ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది.ఆమె బాలయ్యతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదని, అందుకే ఆమె స్థానంలో తెలుగు బ్యూటీ అంజలిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట.దీని కోసం అంజలిని వారు సంప్రదించినట్లు, ఆమె కథ విని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తానికి హీరోయిన్ విషయంలో బాలకృష్ణకు తెలుగమ్మాయి దొరకడంతో చిత్ర షూటింగ్‌ను ఫిబ్రవరి 15 నుండి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తాడట.దీని కోసం ఇప్పటికే గుండు కూడా చేయించుకున్నాడు బాలయ్య.ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.