ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ మేరకు సాయంత్రం 6.30 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న కేంద్రం ఈనెల 20న పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది.
గత 27 ఏళ్లుగా పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా రిజర్వేషన్ బిల్లును రూపొందించారు.
లోక్ సభ మరియు అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించే విధంగా బిల్లును రూపొందించారు.అయితే ఈ బిల్లుకు 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.
కాగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.