కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్న కాళేశ్వరం ! రంగంలోకి ఏసీబీ

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాత ప్రభుత్వ అవినీతి అక్రమాన్ని వెలుగు తీసే కార్యక్రమాలు మొదలయ్యాయి .ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాలేశ్వరం ప్రాజెక్టు లో భారీ అవినీతి జరిగిందని, భారీగా అంచనాలు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు బాగా బాగుపడ్డారని అనేక విమర్శలు విపక్షాలు చేశాయి.

 Brs Party, Telangana Government, Congress, Revanth Reddy, Kaleswaram Project, Me-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కాలేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వన్ని టార్గెట్ చేసుకుని అనేక ఆరోపణలు చేశారు.తమ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై విచారణ చేయించి , దీని వెనక ఉన్న వారందరినీ జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు చేశారు.

  అప్పట్లో రేవంత్ అన్నట్లుగానే నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు , అవినీతి వ్యవహారాలపై దృష్టి సారించారు.

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని,  దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది .హైదరాబాద్ కు చెందిన రాపోలు భాస్కర్ అనే న్యాయవాది దీనిపై ఫిర్యాదు చేశారు.  మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు,  కవిత,  మెగా కృష్ణారెడ్డి,  ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.

ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలకోట్ల రూపాయలు దోపిడిని ఈ ప్రాజెక్టు ద్వారా చేశారని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్లు పేర్కొన్నారు.ముఖ్యంగా సాగు , తాగునీటి ప్రాజెక్టుల పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.

Telugu Brs, Congress, Krishna, Revanth Reddy, Telangana-Politics

అలా ఫిర్యాదు అందగానే వెంటనే ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకోవడం తో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణ వేయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం , దీని వెనుక భారీగా సొమ్ములు చేతులు మారినట్లుగా ఆరోపణలు ఉండడంతో ఇప్పుడు దీనిపై బీఆర్ఎస్ అగ్ర నేతల్లో టెన్షన్ మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube