Mrunal Thakur : త్వరలోనే పెళ్లి చేసుకుంటా అంటూ గుడ్ న్యూస్ చెప్పిన మృణాల్ ఠాకూర్..!!

మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).ఒకప్పుడు సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండియాలోనే మంచి పేరున్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

 Mrunal Thakur Who Gave Good News Saying He Will Get Married Soon-TeluguStop.com

ఈమె తెలుగులో సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పేరు సంపాదించుకుంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రెండు ఇండస్ట్రీలలో వరస అవకాశాలతో దూసుకుపోతుంది.

మృణాల్ ఠాకూర్ తాజాగా హీరో నానితో కలిసి చేసిన హాయ్ నాన్న (Hai nanna) సినిమా విడుదలైంది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు లభించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటా అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.ఇక విషయంలోకి వెళ్తే.

Telugu Hai Nanna, Nani, Mrunal Thakur, Mrunalthakur, Newjersey, Sitaramam-Movie

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ (Family star) అనే సినిమా షూటింగ్లో భాగంగా న్యూ జెర్సీలో ఉంది.ఇక హాయ్ నాన్న సినిమా విడుదలైన నేపథ్యంలో న్యూజెర్సీలోని ఒక థియేటర్ కి వెళ్లి తన అభిమానులతో మాట్లాడుతూ.హాయ్ నాన్న సినిమాలోని నా పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని అనుకుంటున్నాను.అలాగే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.ఇక ప్రస్తుతం నేను ఫ్యామిలి స్టార్ అనే సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను.

ఇక నాని (Nani) కూడా న్యూ జెర్సీ కి రాబోతున్నారు.

ఆయన వచ్చాక మరోసారి న్యూ జెర్సీలోని సినీ ప్రియులని మేము కలుస్తాం.నేను సీతారామం సినిమా సమయంలోనే న్యూజెర్సీ కి వచ్చా.

మరోసారి ఇలా హాయ్ నాన్న సినిమా సమయంలో ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.మిమ్మల్ని మళ్లీ ఇలా కలవడం నా అదృష్టంగా భావిస్తాను.

ఈ సినిమాలోని అమ్మాడి, సమయమా.పాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Telugu Hai Nanna, Nani, Mrunal Thakur, Mrunalthakur, Newjersey, Sitaramam-Movie

అంటూ అక్కడి అభిమానులతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మాట్లాడింది.అయితే ఆమె మాట్లాడుతుండగానే ఒక అబ్బాయి మీకు పెళ్లి అయ్యిందా అని ప్రశ్నించగా.దానికి మృణాల్ ఠాగూర్ నాకు పెళ్లి కాలేదు త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.ప్రస్తుతం మృణాల్ చెప్పిన గుడ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నిజంగానే మృణాల్ పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు అని ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube