క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని..!!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూప్ప కూలిపోతున్నాయి.మహమ్మారి కరోనా తీసుకొచ్చిన సంక్షోభానికి… అనేక దేశాలు బయటపడటానికి నానాదంతాలు పడుతున్నాయి.

 Britain Prime Minister Who Apologized Britain Prime Minister Liz Truss, Britain,-TeluguStop.com

దీంతో అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ దిశగానే బ్రిటన్ ప్రధాని ఆర్థిక సంస్కరణల పేరుతో మినీ బడ్జెట్ పన్నుల కోత పేరిట సంపన్నుల.

పన్నులనీ  తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోవడంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఊబిలోకి వెళ్లిపోయింది.ఈ పరిణామంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రాస్ జాతిని ఉద్దేశించి క్షమాపణలు తెలియజేశారు.

జరిగిన పొరపాటులకు క్షమించండి.ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి.ఆ నిర్ణయాల వల్ల చాలా సమస్యలు తలెత్తాయి.వాటన్నిటికీ బాధ్యత నేనే తీసుకుంటా.

కాస్త సమయం ఇవ్వండి అన్ని పరిష్కరిస్తా అంటూ ఆమె పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు.తప్పులు జరిగిన కానీ దేశం కోసం పనిచేయటానికి అన్ని రకాలుగా కృషి చేస్తాను అని లిజ్ ట్రాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోపక్క లిజ్ ట్రాస్ పై దేశవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆమెను పదవి నుంచి తప్పించడానికి అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube