విలన్ పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్న మాస్ మహారాజా రవితేజ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో హీరో శింబు హీరోగా ఎస్.జె.

 Mass Maharaja Ravi Teja Will Enter The Role Of Villain , Mass Maharaja , Ravi Te-TeluguStop.com

సూర్య కీలక పాత్రలో నటించిన చిత్రం మానాడు.ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో మంచి విజయం కావడంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ తరఫున రానా కొనుగోలు చేసిన్నట్టు తెలుస్తోంది.ఏషియన్ సునీల్ తో కలిసి రానా ఈ సినిమా నిర్మించే బాధ్యతలను తీసుకున్నారట.

ఇకపోతే ఈ సినిమా తెలుగు నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులు చేసి అద్భుతమైన కథను తీర్చిదిద్దే బాధ్యతలను డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఇచ్చినట్టు సమాచారం.

గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తేల్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సినిమా పనిలో బిజీగా మారిపోయారు.ఇకపోతే ఈ సినిమాలో నటించడం కోసం శింబు పాత్రలో నటుడు సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేశారట.

అదే విధంగా ఎస్ జె సూర్య పాత్రలో మాస్ మహారాజా రవితేజ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించినట్టు తెలుస్తుంది.

Telugu Venkat Prabhu, Mass Maharaja, Ravi Teja-Movie

మానాడు సినిమాలో ఎస్ జె సూర్య పాత్ర ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ విలన్ పాత్ర అయితే తెలుగులో విలన్ పాత్రలో నటించడానికి రవితేజ ఒప్పుకుంటారా ఈయన విలన్ గా చేస్తే ప్రేక్షకులు కూడా తనని ఆదరిస్తారా అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు ఏర్పడుతున్నాయి.అయితే ఈ సినిమాలో ఎస్ జె సూర్య పాత్ర ఎంతో విభిన్నంగా ప్రధానమైనది కావడంతో తప్పకుండా రవితేజ ఈ సినిమాకి అంగీకరిస్తారని చిత్ర బృందం భావిస్తున్నారు.మరి ఈ విషయంలో రవితేజ నిజంగానే ఒప్పుకుంటారా? లేదా? అనే విషయం తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube