ఏపీలో పొత్తులపై బీజేపీ ఫోకస్ ! తరుణ్ చుగ్ ఏం తేల్చుతారో ?

ఏపీ బీజేపీలో( AP BJP ) కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.

 Bjp Leader Tarun Chugh Focus On Forming Alliances In Ap Details, Ap Bjp, Tarun C-TeluguStop.com

ఇప్పటికే టిడిపి,  జనసేన పొత్తు( TDP Janasena Alliance ) కొనసాగిస్తుంది.జనసేన బిజెపితో పొత్తులో ఉన్నా,  టిడిపి తోనే కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

బిజెపి ఈ విషయంలో ఒక క్లారిటీ కి రావాలని నిర్ణయించుకుంది.

బిజెపి, జనసేన టిడిపి, కూటమి గా ఏర్పడితే కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపి పెద్దలలోను ఉంది.

అయితే ఏపీ బీజేపీలో రెండు గ్రూపులుగా పార్టీ నాయకులు ఉండడం , ఒక గ్రూపు టిడిపితో( TDP ) పొత్తు ఉండాలని పట్టుబడుతుండగా,  మరో గ్రూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు పెట్టుకోవద్దని ఒత్తిడి చేస్తుంది.ఈ నేపథ్యంలో దీనిపై ఏం చేయాలి ?  ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలో ఒక క్లారిటీకి రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుంది.

Telugu Ap Bjp, Ap, Bjp Tarun Chugh, Bjp, Jagan, Janasena, Somu Veeraju, Tarun Ch

ఈ మేరకు నేడు బిజెపి ముఖ్య నాయకులతో విజయవాడలో బిజెపి కీలక నేత తరుణ్ ఛుగ్( Tarun Chugh ) ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తరుణ్ చుగ్ తీసుకోనున్నారు.దీనిపై అధిష్టానానికి ఆయన నివేదిక ఇవ్వనున్నారు.ఆ తరువాత ఏపీ విషయంలో ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో బిజెపి పెద్దలు ఒక క్లారిటీకి రానున్నారు.అయితే వైసిపి ( YCP ) విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఒక క్లారిటీకి రాలేకపోతోంది .

Telugu Ap Bjp, Ap, Bjp Tarun Chugh, Bjp, Jagan, Janasena, Somu Veeraju, Tarun Ch

తమతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు వైసిపి ఏ మాత్రం ఇష్టపడడం లేదు.కానీ బిజెపికి అవసరమైన సమయంలో వైసీపీ సహకారం అందిస్తోంది.అలాగే కేంద్ర బిజెపి పెద్దలతోనూ జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడం,  ఏపీ బీజేపీ నేతలు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసినా, ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

దీంతో నేటి సమావేశంలో తరుణ్ ఛుగ్ కు ఏపీ బీజేపి నాయకులు ఏ విధమైన క్లారిటీ ఇస్తారు ?  దీనిపై బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube