లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ( Bjp ) ప్రచారంలో దూకుడు పెంచింది.ఈ మేరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ స్థాయి బూత్ అధ్యక్షుల సమ్మేళనాలను కమలనాథులు నిర్వహించనున్నారు.
రాష్ట్ర బీజేపీ నేతల ఆధ్వర్యంలోనే సమ్మేళనాలు జరగనుండగా ఈ నెల 11, 12 మరియు 13వ తేదీల్లో మండల స్థాయి సమావేశాలు జరగనున్నాయి.అదేవిధంగా ఈ నెల 15, 16 మరియు 17 వ తేదీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.