ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఒకరికొకరు బాగా మాట్లాడుకుంటూ ఒకరి సినిమాల ప్రమోషన్లకి మరొకరు వస్తూ ఇండస్ట్రీ లో చాలా కలుపుగోలుగా ఉంటూ ముందుకెళ్తున్నారు.ఇక అందులో భాగంగానే వీళ్లంతా కలిసి నటించడం అనేది కూడా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇలా స్టార్ హీరోలు ఇద్దరు ఒక సినిమాలో నటించడం వల్ల ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఫ్యాన్ వార్స్ అనేవి జరగకుండా ఉంటాయి.
ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీయార్( NTR ) అల్లు అర్జున్( Allu Arjun ) అభిమానుల మధ్య కొన్ని గొడవలైతే జరుగుతున్నాయి.దానికి కారణం ఏంటి అంటే విజయ్ దేవరకొండ కి( Vijay Devarakonda ) అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ విశ్వాక్ సేన్ కి( Vishwak Sen ) సపోర్ట్ చేస్తున్నాడు.
ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరు యంగ్ హీరోలకి సపోర్ట్ చేయడం మంచిదే.కానీ కొన్ని విషయాల్లో విజయ్ దేవరకొండ కి విశ్వక్ సేన్ కి మధ్య చాలా గొడవలు ఉన్నాయి.
దానివల్ల వీళ్ళిద్దరూ సపరేట్ గా ఈ యంగ్ హీరోలకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళ ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.దానివల్ల ఇటు అల్లు అర్జున్ అటు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో విపరీతమైన విమర్శలను చేసుకుంటున్నారు.ఇక ఫ్యాన్స్ మధ్య ఇలాంటి గొడవలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు యంగ్ హీరోలకు సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయమే అంటూ మరి కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు…
.