అమర్ విషయం లో పచ్చి అబద్దాలు చెప్తూ అడ్డంగా దొరికిపోయిన శివాజీ

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss 7 ) టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు శివాజీ.( Sivaji ) ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం శివాజీ టాప్ 1 స్థానం లో ఉన్నాడు.

 Bigg Boss Telugu 7 Sivaji Targets Amardeep Details, Bigg Boss Telugu 7, Sivaji ,-TeluguStop.com

మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆయన బీభత్సంగా ఆడిన సందర్భాలు చాలా తక్కువే.కానీ మాస్క్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, న్యాయంగా వ్యవహరిస్తున్నాడు, హౌస్ లో ప్రతీ గేమ్ లోను తన ఆలోచనలను ఫాలో అవ్వడం వల్లే ఎక్కువ శాతం విజయాలు వచ్చాయని ఆడియన్స్ అభిప్రాయం.

అందుకే శివాజీ నేడు టైటిల్ ని కొట్టే రేంజ్ లో ఉన్నాడు.కానీ ఈయన ప్రశాంత్( Prasanth ) మరియు యావర్ కి( Yawar ) సపోర్ట్ గా ఉంటూ, అమర్ దీప్ ని ప్రతీ రోజు టార్గెట్ చేస్తున్నాడని సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తున్న టాక్.

ముందు అయితే అమర్ దీప్ చాలా బలంగా కౌంటర్ ఇచ్చేవాడు కానీ, ఈమధ్య బాగా మెతకపడ్డాడు.

Telugu Amardeep, Ashwini, Bigg Boss, Bigg Boss Ups, Nagarjuna, Prince Yawar, Siv

అమర్ దీప్ ని ఎంత టార్గెట్ చేసినా సైలెంట్ గా ఉంటున్నాడు కాబట్టి, అతని పై శివాజీ టార్గెట్ చెయ్యడం ఇంకా పెరిగిపోయింది.ప్రతీ చిన్న విషయం లోను అమర్ దీప్ పై ‘నువ్వు దేనికి పనికి రావు’ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు.అమర్ దీప్( Amardeep ) గత రెండు వారాల నుండి మంచిగా ఆడుతున్నాడు.

అంతకు ముందు గేమ్ రూల్స్ పాటించకుండా ఆడేవాడు కానీ, ఇప్పుడు మాత్రం తనకి వచ్చిన ప్రతీ టాస్కులో నియమాలు ఉల్లఘించకుండా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు.అయితే మొన్న రాత్రి శివాజీ తేజా తో మాట్లాడుతూ ‘ ఈ హౌస్ లో అమర్ దీప్ తప్ప ప్రతీ ఒక్కరు బాగా ఆడుతున్నారు అని అంటాడు’.

అప్పుడు తేజా ( Teja ) దానికి సమాధానం ఇస్తూ ‘రెండు వారాల నుండి బాగా ఆడుతున్నాడు మనోడు’ అని అంటాడు.

Telugu Amardeep, Ashwini, Bigg Boss, Bigg Boss Ups, Nagarjuna, Prince Yawar, Siv

అప్పుడు శివాజీ దానికి సమాధానం ఇస్తూ ‘ఏమి ఆడాడు వాడు.అశ్వినీ( Ashwini ) కూడా బాగా ఆడింది’ అని అంటాడు.అయితే ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) హౌస్ మేట్స్ తో ‘ఈ ఇంట్లో మీకు నిచ్చెన ఎవరు ?, పాము ఎవరు?’ అనే గేమ్ ఆడిస్తాడు.ఈ గేమ్ లో శివాజీ అమర్ దీప్ ని పాము స్థానం లో నిల్చోబెట్టి ‘ప్రతీ దానికి వాడు నేనేదో వాడు ఆడడం లేదు అని చెప్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు’ అని అంటాడు.అమర్ దీప్ చేసిన ప్రతీ మిస్టేక్ ని ప్రతీ వారం వీడియో వేసి చూపించే నాగార్జున, శివాజీ విషయం లో ఎందుకు అలా చెయ్యడం లేదు?, ఇలా హోస్ట్ బైయాస్ గా ఉంటే ఇక బిగ్ బాస్ షో ఎందుకు చూడడం అని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube