ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.రాజధాని అంశం కోర్టులో ఉందన్న ఆయన అమరావతి రాజధానికి బీజేపీకి కట్టుబడి ఉందని తెలిపారు.
అనంతరం మత్స్యకారుల పరిస్థితులపై ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ జిల్లాలో వారి స్థితిగతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటుందని ఆరోపించారు.మత్స్య సంపద యోజన పేరుతో కేంద్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న ఆయన ముందస్తు కేటాయింపుల్లో భాగంగా ఏపీకి రూ.2 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.ఏపీలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని తెలిపారు.
అంతేకానీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని వెల్లడించారు.







