బిగ్ బాస్ సీజన్ 7.( Bigg Boss 7 ) ఉల్టా పుల్టా అనే పేరు పెట్టుకుని ఆ పేరును సాధన చేసుకునేందుకు బిగ్ బాస్ యాజమాన్యం శతవిధాల ప్రయత్నిస్తుంది.
హౌస్ మేట్స్ కి బ్రెయిన్ లెస్ అనే ట్యాగ్ ఇచ్చే బదులు తమకు కూడా బ్రెయిన్ లేదు అని ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది.ఈ సీజన్ లో నిజంగా ఒకరిని మించిన మరోకరు బ్రెయిన్ లెస్( Brainless ) అని నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈసారి ఇంటి సభ్యులు అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకం.అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది యావర్.అబ్బో ఈ యావర్( Yawar ) వేషాలు మామూలుగా లేవు ఒక్క రోజు కెప్టెన్ అయితే చాలు అతనిలోనే నిజమైన యాంగిల్ అందరికీ బయటకు వచ్చేసింది.కెప్టెన్ అయ్యి కూడా ప్రాపర్టీస్ ధ్వంసం చేయడంలో ఇతని తర్వాతే ఎవరైనా.
ఇక శోభా శెట్టి.( Sobha Shetty ) మేకప్ వేసుకోవడం కోసమే బిగ్ బాస్ కి వచ్చాను అని ఫీల్ అవుతుందో ఏమో కానీ ఒక్కరోజు ముఖానికి క్రీం పెట్టకపోతే చూడలేం బాబోయ్… శివాజీ( Sivaji ) పెద్దమనిషి తరహా పనులు చేస్తూనే చిల్లర పనులు చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా.
ఒక్కోసారి బాబు గారు అంటూ వంగి దండాలు పెడతారు మరోసారి నేను ఎలా అయినా ఉంటాను అంటు అందరినీ అదరగొడతాడు.ఇక తనకు బ్రెయిన్ లేదు అని ఎన్ని వందల సార్లు ప్రూవ్ చేసుకుంటాడో తెలియదు ఈ అమర్ దీప్.
ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని అమాయకంగా నటిస్తూ అడ్డదిడ్డంగా దొరికిపోతున్నాడు.
నిన్న మొన్న వచ్చిన ఆ భోలే( Bhole ) సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువే అతను ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో అస్సలు తెలియడం లేదు.ఇక బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు తిరిగొచ్చాడు అర్థం కాని వ్యక్తి గౌతమ్.( Gautam ) తనకు తానే అశ్వద్ధామ అని ఫీల్ అయిపోతూ ఉన్నాడు మరి రాను రాను ఏమవుతాడో చూడాలి.
వంటలక్క లాగానే వంటలు చేస్తూ అవికాస్త తక్కువ అయినా ఎక్కువైనా ఏడుస్తూ ప్రియాంక కిచెన్ కి మాత్రమే పరిమితం అయిపోయింది.పల్లవి ప్రశాంత్( Pallavi Prasanth ) విషయానికి వస్తే అతనికి తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడు
కానీ అతను ఏం చెప్పినా ఎవ్వరు వినరు.బిగ్బాస్ లాంటి హౌస్ లో ఉండడానికి ఏమాత్రం సెట్ కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అశ్విని ఆమెకు ఈ హౌస్ అసలు సెట్ కానే కాదు.అర్జున్ తనకు తాను అన్నీ తెలిసి మేధావిలా బిహేవ్ చేస్తున్నాడు కానీ అతడి గుట్టు బయటపడడానికి చాలా తక్కువ సమయమే ఉంది మిత్రమా.
స్మార్ట్ గా కనిపిస్తూనే సందీప్ గేమ్ ఎప్పుడో ఫాల్డౌన్ అయిపోయింది ముందు ముందు ఎలా కొనసాగుతుందో అతనికి కూడా తెలియడం లేదు.ఇక పూజ నయని పావని ఎందుకు హౌస్ కి వచ్చారో వాళ్ళే తెలుసుకోవాలి.