ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు తిరిగి విడుదలవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటించిన మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
మెగాస్టార్ సినీ కెరియర్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచినటువంటి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇలా ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
బాలీవుడ్ క్లాసిక్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ రీమేక్ గా 2004లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ( Shankar Dada MBBS ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, శ్రీకాంత్ కామెడీ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయని చెప్పాలి.ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాబోతోంది.
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ద్వారా చిరంజీవి నవంబర్ 4వ తేదీ ( Shankar Dada MBBS Re Release )తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.చిరంజీవి తన ఈ సినిమాని మంచి రోజు సెలెక్ట్ చేసుకుని ఫ్రీ రిలీజ్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.ఈ సినిమా విడుదల సమయంలో ఎలాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు విడుదల కావడం లేదు.ఒకవేళ విడుదలైన అవి చిన్న చిన్న హీరోల సినిమాలు కావడంతో చిరంజీవి సినిమాపై పెద్దగా ప్రభావం చూపవు కనుక ఆరోజు ఈ సినిమాని తిరిగి విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవచ్చు అన్న ఉద్దేశంతో నిర్మాతలు నవంబర్ 4వ తేదీని ఫిక్స్ చేశారు.
ఇక పోతే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల( Re Release ) పట్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది మొదట్లో చూపినటువంటి ఆసక్తి ఇప్పుడు చూపించలేకపోవటం వల్లే కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయని చెప్పాలి.మరి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది.