దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు( Vinayaka Navratri ) వేడుకలు ఘనంగా జరిగాయి.నేటితో నవరాత్రి వేడుకలు ముగిసాయి.
ఇన్ని రోజులపాటు మండపాలలో పూజలు అందుకున్న గణనాథులు నేడు అనగా మంగళవారం సెప్టెంబర్ 17వ తేదీన గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ ముంబై లాంటి ప్రదేశాలలో ఇంకా కొన్ని గణనాథుల గ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.ఇకపోతే కొన్ని కొన్ని ప్రదేశాలలో గణనాథుల శోభాయాత్ర అట్టహాసంగా జరుగుతుండగా మరికొన్ని ప్రదేశాలలో వినాయక లడ్డు వేలం పాటలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.
ఇక నిమజ్ఞనాలకు ముందు వినాయకుని లడ్డూ వేలం( Ganesha’s laddu auction ) పాటలకు ఎంతో ప్రాధాన్యముంది.సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు.ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతుంటారు.అలా తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజా( Youtuber Tasty Teja ) వినాయకుడి లడ్డూని భారీ ధరకు దక్కించుకున్నాడు.
తన సొంత ఊరు గుంటూరు సమీపంలోని తెనాలిలో జరిగిన గణేష్ నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు టేస్టీ తేజా.అలాగే చాలా మందితో పోటీ పడి సుమారు 25 కేజీల గణపతి లడ్డూని రూ.75 వేలకు సొంతం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నాడీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.మా ఊరిలో గత 25 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది 25వ ఏట కావడంతో 25 కేజీల భారీ లడ్డూని వినాయకుడికి సమర్పించారు.ఇప్పుడు ఈ లడ్డూని వేలం పాటలో రూ.75 వేలకు దక్కించుకున్నాను అని చెప్పుకొచ్చాడు టేస్టీ తేజా.కాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేరే లవ్వడంతో ఆ వీడియోని చూసిన అభిమానులు మీకు అంతా మంచే జరగాలి,స్వామి ఆశీస్సులు దక్కాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.వినాయకుడి లడ్డూని వేలంలో దక్కించుకుని ఆ తర్వాత ఊరేగింపుగా ఇంటికి తీసుకుని వెళ్లాడు టేస్టీ తేజా.
ఇక గణేష్ నిమజ్జన కార్యక్రమంలోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడీ ఫేమస్ యూట్యూబర్.గ్రామస్తులతో కలిసి ఎంతో హుషారుగా డ్యాన్సులు చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.