తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ షో( Bigg Boss Show) ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.కొట్లాటలు గొడవలు, అరుపులతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు కంటెస్టెంట్ లు.
ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.చూస్తుండగానే అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది.
ఇక రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా దగ్గర పడింది.మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళానున్నారు.

ఇకపోతే హౌస్ లో ఉన్న వారికీ మద్దతుగా బయటి నుంచి పలు పలు విధాలుగా మద్దతు లభిస్తుంది.అలా ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ బాషా( Shekar Basha )కు మద్దతుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాషా తన కోసం ఎంతో చేశాడని, అతని కోసమైనా బిగ్ బాస్ హౌస్ కు వెళతానంటూ చెప్పుకొచ్చాడు.కాగా ఇటీవల రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు.
లావణ్య( Lavanya ) అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఈ వివాదానికి సంబంధించి రాజ్ తరుణ్ పై కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ కు అండగా నిలబడ్డాడు శేఖర్ బాషా.అతనికి మద్దతుగా పలు ఛానెల్స్ లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.

అలాగే లావణ్య పై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచాడు.ఈ క్రమంలోనే అతనిపై దాడి కూడా జరిగింది.కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు.ఆ తర్వాత కోలుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో తనకు అండగా నిలబడిన శేఖర్ బాషా కు మద్దతు ఇచ్చేందుకు బిగ్ బాస్ కు వెళతానంటున్నాడు రాజ్ తరుణ్.కాగా శేఖర్ బాషా నాకు సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడు.
ముఖ్యంగా అతను నిజం కోసం నిలబడ్డాడు.అలాంటి తన కోసం అవసరమైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తాను.
గతంలో పలు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఒకట్రెండు సార్లు మాత్రమే శేఖర్ బాషాను కలిశాను.అంతే తప్ప అతడితో నాకు ఎలాంటి స్నేహం లేదు.
కానీ నా కోసం అతను ఎంతో చేశాడు.నాకు మంచి మిత్రుడిగా మారాడు అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.