బీజేపీకి గట్టి షాక్... గులాబీ గూటికి బీజేపీ కొన్సిలర్..

రోజు రోజుకు మసకబారుతున్న కషాయపు పార్టీ పరిస్థితిమంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో తెరాసలో చేరిన హుజురాబాద్ 20 వార్డు కౌన్సిలర్భారీ మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయంమంత్రి గంగుల కాన్వాయ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులుప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్న మంత్రి గంగుల హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ పరిస్థితి రోజురోజుకు మసకబారుతుంది అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ పేర్కొన్నారు.నేడు మంగళవారం హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్ తో పాటు ముఖ్య అనుచరులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

 Big Shock To Bjp Bjp Consular To Gulabi Gooty , Bjp, Gulabi Gooty, Sri Gangul-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పార్టీకి స్థానం లేదని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బిజెపి నాయకులు కెసిఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు క్యూ కడుతున్నారని వెల్లడించారు.అంతకుముందు సాధారణ తనిఖీల్లో బాగంగా హుజురాబాద్ ప్రచారానికి వస్తున్న మంత్రి గంగుల కాన్వాయ్ ను నగర శివారులో పోలీసులు తనిఖీలు చేసారు, ఓపికగా తనిఖీలకు పూర్తిగా సహకరించిన గంగుల విదినిర్వహణలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి అన్నివిదాలుగా సహకారాలందిస్తామని, వారి విధుల్ని సజావుగా చేసుకునేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ వెంట మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, గందే శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సాంబశివ, సదాశివ, రవి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube