సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.ముఖ్యంగా హీరో హీరోయిన్ లకు సంబంధించిన రూమర్స్ తరచుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
అలా గత కొద్ది రోజులుగా హీరోయిన్ రష్మిక ( Heroine Rashmika ), హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda Srinivas )ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలసి పలుసార్లు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి.
ఇదే విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇదే విషయంపై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు.తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్( YouTube channel ) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.కాగా బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటించిన హిందీ చిత్రం చత్రపతి.
ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్ లో భాగంగానే ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.

నేను రష్మిక కేవలం మంచి స్నేహితులం మాత్రమే.మేమిద్దరం హైదరాబాద్‌కు చెందిన వాళ్లం కావడంతో షూటింగ్ పనుల మీద తరచూ ముంబయికి వెళ్తుంటాము.అలా వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టులో కలుసుకుంటాము.అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు చాల తక్కువ.అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? ఈ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే? అసలు ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.ఇకపోతే చత్రపతి సినిమా విషయానికి వస్తే వివి వినాయక్ ( V v Vinayak ) దర్శకత్వం వహిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నుస్రత్ భరుచా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు.