కొత్త సంవత్సరాన మారిపోనున్న బ్యాంకు లాకర్ రూల్స్... త్వరగా అగ్రిమెంట్‌ చేసుకోండి!

రేపటితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రపంచమంతా సిద్ధమైపోయింది.దాంతో వివిధ సంస్థలతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 Bank Locker Rules To Change In New Year Make An Agreement Soon , Bank Loker Rule-TeluguStop.com

బ్యాంకు లాకర్ రూల్స్ మీరు వినే వుంటారు.బ్యాంక్‌లో లాకర్‌ వున్నవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు.

మీ బ్యాంక్‌ శాఖ వద్దకు వెళ్లి కొత్త ఒప్పందం మీద ఇంకా సంతకం చేయకపోతే, ఆలస్యం చేయొద్దని చెబుతున్నారు.ఎందుకంటే, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే లాకర్ రూల్స్ మారుతాయట.

ఇక లాకర్ రూల్స్‌ అనేవి దాదాపుగా బ్యాంకులన్నిటికీ ఒకే విధంగా వుంటాయని చెబుతున్నారు.ఇక కొన్ని బ్యాంకులు లాకర్‌ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేయాలని చెబుతుంటాయి.

లేదంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలని బ్యాంకులు డిమాండ్‌ చేస్తుంటాయి.అలాగే స్వప్రయోజనాల కోసం మరికొన్ని చవుకబారు రూల్స్‌ను బలవంతంగా ఖాతాదారుల నెత్తిన రుద్దే ప్రమాదం కూడా లేకపోలేదు.

ఇది కస్టమర్లకు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవచ్చు.

ఈ నేపథ్యంలో, ఖాతాదారుల ఇబ్బందులను తొలగించేలా, RBI (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) కొత్త లాకర్‌ రూల్స్‌ తీసుకొచ్చింది.కాగా ఈ కొత్త నియమాలు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ ప్రయోజనాలను పొందాలంటే, ముందుగా ఖాతాదారుడు తన బ్యాంకుతో లాకర్ అగ్రిమెంట్‌ మీద సంతకం చేయాల్సి ఉంటుంది.

ఈ విషయాన్నీ ఇప్పటికే.SBI (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), PNB (పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) సహా కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని తమ కస్టమర్ల దృష్టికి తీసుకెళ్లాయి.

కాబట్టి మేలుకోండి మిత్రులారా!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube