తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) ఈనెల 10వ తేదీ నుంచి యాత్ర నిర్వహించనున్నారు.ఈ యాత్రకు ‘ విజయ సంకల్ప యాత్ర’ గా( Vijaya Sankalpa Yatra ) నామకరణం చేశారు.
లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు ఈ యాత్రను కొనసాగించాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈనెల 10న కొండగట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
కాగా ఈ యాత్ర కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో కొనసాగనుంది.గ్రామాల్లో పాదయాత్ర చేయనున్న బండి సంజయ్ ప్రజలతో మమేకం కానున్నారు.ఈ మేరకు తొలి విడతగా వేములవాడ,( Vemulawada ) సిరిసిల్ల( Sircilla ) నియోజకవర్గాల్లో మొత్తం 119 కిలోమీటర్ల మేర బండి సంజయ్ యాత్రను నిర్వహిచనున్నారని సమాచారం.ఈ క్రమంలోనే యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నేతలతో ఆయన కీలకంగా చర్చించారు.