సూపర్ స్టార్ రజినికాంత్( Superstar Rajinikanth హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా జైలర్( Jailer ).ఈ సినిమా ఆగష్టు 10న రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది.
తెలుగు లో కూడా ఈ సినిమా సూపర్ వసూళ్లను రాబడుతుంది.పోటీగా వచ్చిన భోళా శంకర్ ఫ్లాప్ అవడం జైలర్ కి బాగా కలిసి వచ్చింది.
ఇదిలాఉంటే జైలర్ సినిమా హిట్ అవడంతో డైరెక్టర్ నెల్సన్( Nelson Dilip Kumar ) జైలర్ 2 కూడా ఉంటుందని చెప్పారు.అయితే జైలర్ సినిమాలో అసలైతే బాలయ్య ని పెట్టాలని అనుకున్నాడట నెల్సన్.
కానీ అందుకు తగిన సందర్భం కుదరలేదని చెప్పాడు.ఇక జైలర్ 2 చేయడం జరిగితే ఈసారి బాలయ్య( Balakrishna ) మాత్రం పక్కా ఉంటాడని చెప్పొచ్చు.జైలర్ 2( Jailer 2 ) సినిమా విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.జైలర్ 2 నెక్స్ట్ ఇయర్ ఉంటుందని ఈ సినిమా మరోసారి ఫ్యాన్స్ కి రజిని స్టామినా ఏంటో చూపించేలా చేస్తుందని అంటున్నారు.
ఇక జైలర్ వసూళ్ల( Jailer Movie Collections ) విషయానికి వస్తే రజిని బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ఈ సినిమా చూపిస్తుంది.సినిమాతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీరింది.
జైలర్ 2 కచ్చితంగా మరో సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు.