Vichitra: బాలకృష్ణ నటి విచిత్ర వివాదం.. తెరపైకి మరో కోలీవుడ్ స్టార్ హీరో పేరు.. ఏం జరిగిందంటే..?

ఒకప్పుడు తమిళంలో 90 కి సినిమాల్లో హీరోయిన్ గా చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న విచిత్ర (Vichitra) ఈ మధ్యకాలంలో తమిళ బిగ్ బాస్ షోలో( Tamil Bigg Boss ) సంచలన కామెంట్స్ చేసింది.ఈమె చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించాయి.

 Balakrishna Actress Vichitra Controversy Kollywood Actor Vijay Kanth On The Scr-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఈమె ఓ తెలుగు స్టార్ హీరో నన్ను రూమ్ కి రమ్మని పిలిచి నేను రిజెక్ట్ చేయడంతో నన్ను చిత్రహింసలు పెట్టాడని, ఆయన వల్ల నేను క్యాస్టిం** కౌచ్ ఎదుర్కొన్నానని,అలాగే ఆ హీరో కారణంగా నేను సినిమాలకు దూరమయ్యాను అంటూ ఇలా తన ఆవేదన వెల్లగక్కింది.అయితే ఈమె తెలుగులో నటించింది కేవలం వెంకటేష్ తో పోకిరి రాజా అలాగే బాలకృష్ణతో భలే వాడివి బాసూ (Bhalevadivi Basu) అనే సినిమాలో చేసింది.

అయితే ఈమె చెప్పిన మాట ప్రకారం చూస్తే ఈమెను అలా ఇబ్బంది పెట్టింది నందమూరి బాలకృష్ణనే( Balakrishna ) అని కొన్ని వెబ్సైట్స్ అధికారికంగానే రాశాయి.

ఇక వీరి వివాదం అలా కొనసాగుతున్న సమయంలో మరో హీరో పేరు తెరపై చాలా వైరల్ అవుతుంది.

ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్. వీరి వివాదంలో విజయకాంత్ (Vijay kanth) ఎందుకు వచ్చి పడ్డారు అని మీరందరూ అనుమానపడవచ్చు.

అయితే హీరోయిన్ విచిత్ర తనకు ఆ హీరో వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేస్తే నడిగర్ సంఘం అధ్యక్షుడు అదంతా మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో అంతగా కావాలనిపిస్తే పోలీసు కేసు పెట్టు వారిని ఆశ్రయించండి.అంతేకానీ ఇలా అసోసియేషన్ కి ఎందుకు వచ్చి చెబుతున్నారు అంటూ నడిగర్ సంఘం అధ్యక్షుడు విచిత్రను కోపగించుకున్నారట.

Telugu Vichithra, Vichitra, Vijay Kanth-Movie

ఇక తనకు న్యాయం చేయాల్సిన వాళ్లు కూడా చేతులెత్తేయడంతో సినిమాలు నుండి తప్పుకున్నాను అని విచిత్ర చెప్పుకొచ్చింది.అయితే ఈమె 2000-2002 మధ్య సంవత్సరం సంవత్సరంలో నేను ఆ సమస్యలు ఎదుర్కొన్నాను అని చెప్పింది.ఇక 2000 నుండి 2006 వరకు నడిగర్ సంఘం (Nadigar community) అధ్యక్షుడిగా అప్పటి స్టార్ హీరో విజయ్ కాంత్ కొనసాగుతున్నారు.అంటే విచిత్రను నీ పని నువ్వు చేసుకోమని చెప్పింది విజయ్ కాంత్.

ఇక రీసెంట్ గా ఈమె ఈ విషయాన్ని బయట పెట్టింది కానీ అధ్యక్షుడు పేరు బయట పెట్టలేదు.

Telugu Vichithra, Vichitra, Vijay Kanth-Movie

కానీ ఈమె చెప్పేదాన్ని ప్రకారం విజయ్ కాంత్ (Vijay kanth) విచిత్రను వెళ్లిపోమన్నారని తనకి జరిగిన అన్యాయాన్ని కూడా పట్టించుకోలేదు అని ఈ విషయం తెలిసి కొంతమంది నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు ఒక ఆడపిల్ల నాకు ఆ హీరో వల్ల ఇబ్బందులు వస్తున్నాయి నేను ఇబ్బంది పడుతున్నాను అని ఆయన ముందు గోడు చెప్పుకుంటే ఎందుకు ఆయన స్పందించలేదు.ఎందుకు ఆ హీరోయిన్ తరఫున నిలబడి ఆమెకు మద్దతు ఇవ్వలేదు అటు పక్కన ఉన్నది స్టార్ హీరో అని భయపడ్డాడా అంటూ ఇలా చాలామంది ఆయనపై ఫైర్ అవుతున్నారు.

ఇలా హీరోయిన్ విచిత్ర మాట్లాడిన మాటలతో ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు హీరో విజయ్ కాంత్ పై తమిళంలో ఎలాంటి విమర్శలు అయితే లేవు.

ఇదే మొదటిది.ఇక విచిత్ర హీరో పేరు తీయకుండా మాట్లాడిన మాటల ఆధారంగా బాలకృష్ణనే అని అందరూ నిర్ధారించినప్పటికీ ఇప్పటివరకు బాలకృష్ణ (Balakrishna) ఈ విషయంపై స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube