చాలాకాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఇంటికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )స్వయంగా వెళ్లి సుదీర్ఘ సమయం పాటు చర్చించడంతో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిందని మీడియాలో చర్చనీయాంశంగా మారింది .ముఖ్యంగా తెలుగుదేశం లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు పవన్ ను అసంతృప్తికి గురి చేశాయని అందుకే యువగళం పాదయాత్రకు హాజరవ్వడానికి కూడా పవన్ సుముఖం గా లేరంటూ వార్తలు వచ్చాయి.
తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ కు అధ్యక్షుడు అచ్చం నాయుడు( Acham naidu ) కూడా బిజీ షెడ్యూల్ వల్ల పవన్ యువగళం కార్యక్రమానికి హాజరవడం లేదని ప్రకటించారు.దాంతో తెరవెనుక ఏదో జరుగుతుంది అన్న అనుమానాలకు బలం చేకూరింది .అయితే చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వచ్చి చర్చించడంతో పవన్ అలక వీడి కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా ప్రకటించారు.
అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దగ్గరే ప్రధానంగా పేచి వచ్చినట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా తమంతట తాము అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్ళిపోతుండడం పవన్ కు( Pawan Kalyan ) ఆగ్రహం తెప్పించిందని గ్రహించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పవన్ తో సీట్ల సర్దుబాటుపై తేల్చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.ప్రాథమికంగా 30 సీట్ల మధ్య రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని వార్తలు వస్తున్నాయి .
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ( Janasena )కనీసం 40 నుంచి 50 స్థానాల్లో బలం ఉంటుందని ఆశిస్తున్న జనసైనికులకు 30 స్థానాలతో కనుక పవన్ సరిపెట్టుకుంటే కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి పండగ లోపు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల తకరారు ఒక కొలిక్కి వచ్చేస్తుందని ప్రచారం జరుగుతున్న దరిమిలా రెబల్స్ నుంచి వచ్చేఇబ్బందుల్ని ఈ రెండు పార్టీలు ఎలా తట్టుకుంటాయి అన్నది ఇప్పుడు ప్రధాన సమస్యగ మారింది .అయితే ఎన్నికలు తరుముకు వస్తూ ఉండడం తో ఇక చిక్కుముడులన్నీ విప్పేసుకుని సాధ్యమైనంత వేగం గా ఎన్నికల కు సిద్దం అవ్వాలన్నదే రెండు పార్టీల అదినేత ల ఆలోచన గా తెలుస్తుంది .