ఐపీఎల్ లో తన సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్..!

తాజాగా ముంబై – హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో సచిన్( Sachin ) తనయుడు అర్జున్ టెండూల్కర్( Arjun Tendulkar ) తన సత్తా ఏంటో చూపించాడు.ఆఖరి ఓవర్లో బ్యాటర్లను కట్టడి చేసి తొలి వికెట్ తీసిన అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 Arjun Tendulkar Showed His Ability In Ipl , Arjun Tendulkar , Ipl ,mumbai Hyder-TeluguStop.com

రోహిత్ శర్మ( Rohit Sharma ), అర్జున్ పై నమ్మకం ఉంచి ఆఖరి ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు.

అర్జున్ ఆట ప్రదర్శన పై రోహిత్ స్పందిస్తూ.సచిన్ తో కలిసి తాను డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నానని, ప్రస్తుతం సచిన్ తనయుడు అర్జున్ తో కలిసి ఆడడం ఎంతో ఆసక్తిగా అనిపించిందని తెలిపాడు.అర్జున్ తో కలిసి ఆడుతుంటే జీవితం మళ్లీ మొదటి నుండి ప్రారంభమైనట్లుగా అనిపించిందని తెలిపాడు.

అర్జున్ తమ జట్టులో మూడేళ్లుగా కొనసాగుతున్నాడని, అర్జున్ లో ఆత్మవిశ్వాసం ఎక్కువ అంటూ మెచ్చుకున్నాడు.

అర్జున్ కు ఐపీఎల్( IPL ) లో ఇది రెండవ మ్యాచ్.

కొత్తబంతి తో బౌలింగ్ చేసిన అర్జున్ తొలి రెండు ఓవర్లకు 14 పరుగులు ఇచ్చాడు.ఇక హైదరాబాద్ జట్టు మ్యాచ్లో గెలవాలంటే ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.

రోహిత్ నుండి బంతి అందుకున్న అర్జున్ చాలా సమర్థవంతంగా హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశాడు.

ఐదో బంతికు భువనేశ్వర్ వికెట్ తీసి ఐపీఎల్ లో తొలి వికెట్ తీసిన బోణి కొట్టేశాడు.14 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై ముంబై జట్టు విజయం సాధించింది.ముంబై జట్టు ఐదు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు గెలిచి, లీగ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది.

అంతే కాకుండా ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డ్ పడింది.ఐపీఎల్ చరిత్రలో 6000 పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube