వాట్సాప్‌లో వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూసారా? యానిమేటెడ్ ఎమోజీ!

వాట్సాప్( Whatsapp ) మంచి స్పీడుమీద వుంది.ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ తన వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది.

 Whatsapp Introducing Animated Emojis To Its Users Details, Animated Emoji, Whats-TeluguStop.com

ఈ క్రమంలోనే యానిమేటెడ్ ఎమోజీలను( Animated Emoji ) పంపేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది.లేటెస్ట్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

యానిమేటెడ్ ఎమోజీలు ప్రస్తుతం టెలిగ్రామ్ స్లాక్ వంటి మెసేజింగ్ సర్వీస్‌లలో సపోర్ట్ చేస్తుండగా ఇపుడు వాట్సాప్ వాటిని ట్రై చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఆపిల్, యూజర్ల కోసం వాట్సాప్ బీటా( Whatsapp Beta ) ఫ్యూచర్ అప్‌డేట్ ఫీచర్‌ను యాడ్ చేసే పనిలో పడిందన్నమాట.వాట్సాప్ ప్రస్తుతం స్టిక్కర్లు, GIFలతో పాటు స్టాండర్డ్, స్టాటిక్ ఎమోజీలను పంపేందుకు యూజర్లకు అనుమతిని ఇస్తుండగా ఇపుడు మరో అడుగు ముందుకేసింది.వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.

కొత్త యానిమేటెడ్ ఎమోజీకి సపోర్టును యాడ్ చేయడంలో సర్వీసు అందిస్తోంది.వా బీటా ఇన్ఫో ప్రకారం.

కొత్త యానిమేటెడ్ ఎమోజి డిఫాల్ట్‌గా పంపుతారు.అదనంగా, ఈ యానిమేషన్లు సైజులో చిన్నవి.

క్వాలిటీ కోల్పోకుండా సైజు మార్చవచ్చు.

ఇక ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో కనిపించడం విశేషం.అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.వాట్సాప్ iOS, ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ బీటా ఫ్యూచర్ అప్‌డేట్ అదే ఫీచర్‌ను తీసుకువస్తుందని ఫీచర్ ట్రాకర్ పేర్కోవడం మనం ఇక్కడ గమనించవచ్చు.

ఇకపోతే వాట్సాప్ ఇటీవలే ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ యూజర్లందరికి 3 కొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube