అఫిషియల్ : పవన్ సరసన ఆ హీరోయిన్.. పోస్టర్ తోనే విజిల్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి’‘ ( OG ) ఒకటి.ఇదే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది.

 Priyanka Arul Mohan Confirmed As Female Lead In Pawan Kalyan's Og, Priyanka Aru-TeluguStop.com

ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Sujeeth ) తెరకెక్కించ బోతున్నాడు.ప్రజెంట్ పవన్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

ఒకదాని తర్వాత మరో సినిమా షూట్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటూ తన లైనప్ ను పూర్తి చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూసారు.మరి ఈ రోజు ఈ సస్పెన్స్ కు మేకర్స్ తెర తీశారు.అఫిషియల్ గా ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అని అనౌన్స్ మెంట్ చేసారు.

కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో ఆయనకు జోడీగా నటించే హీరోయిన్ గురించి అదిరిపోయే పోస్టర్ వదిలారు.ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ( Priyanka Arul Mohan ) హీరోయిన్ గా నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ వెల్కమ్ ఆన్ బోర్డు ప్రియాంక అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది.ఈమె కూడా సెట్స్ లో చేరినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.

గ్యాంగ్ లీడర్ లో నటించి మెప్పించిన ప్రియాంక మోహన్ కు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.ఈ హీరోయిన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాను డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఆడియెన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ లతో ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube