ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు - వైఎస్ షర్మిల

కృష్ణా, గన్నవరం నియోజకవర్గం : హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కెవిపి రామచంద్రరావు.ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు.

 Ap Pcc Chief Ys Sharmila Comments On Ap Special Status , Ap Pcc Chief Ys Sharmil-TeluguStop.com

ఎయిర్పోర్టులో మీడియాతో వైఎస్ షర్మిల.అసెంబ్లీ సమావేశంలో ఈసారైనా ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ కి లేఖల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం చేయాలని సూచించడం జరిగింది.ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు.

రాజధాని సహకారం చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్నది బీజేపీ అయినా సరే ఒక్క సంవత్సరం కూడా ఆంధ్ర గురించి ఆలోచించలేదు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏ ఒక్కరు రాష్ట్రం గురించి ఆలోచించలేదు.వాళ్ళ స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టింది.

ఈసారైనా సరే అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం పాస్ చేయాలి.

ఆంధ్ర కి ప్రత్యేక హోదా బిజెపి పార్టీ ఎందుకు ద్రోహం చేసిందో పోలవరం ఎందుకు దోహం చేసిందో వీటన్నిటి గురించి అసెంబ్లీలో చర్చలు జరిగి తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తున్నాను.

ఒకరేమో కుర్చీ ఎలా కాపాడుకోవాలని ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించాలి అనే పనిలో ఉన్నారు.జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు.

బిజెపి పొత్తు పార్టీలైన వైసిపి టిడిపి జనసేన పార్టీలను ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది.కాంగ్రెస్ పార్టీ ఏపీ సీసీ అధ్యక్షురాలిని నేను రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి.

కానీ అవేవీ పెట్టకుండా మహిళా అని చూడకుండా, కనీసం మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధత ఉందా ప్రజాస్వామ్యం అని అసలు మీకు గుర్తుందా.మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మిగతా వారికి మిగతా నాయకులకు ప్రజలకు భరోసా కల్పించవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు రక్షణ కల్పించవలసిన పరిస్థితి లేదా.

అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం.ఇదెక్కడి ప్రజాస్వామ్యం.అనంతరం రోడ్డు మార్గాన బాపట్లలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లిన షర్మిల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube