ముంచుకొస్తున్న మరో తుఫాను .. ఏపీ వాసులు సేఫ్..!!

దాదాపు కొద్ది నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కోడుతున్నాయి.దీంతో వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి.

 Another Storm Is Coming People Of Ap Are Safe , Another Storm, Andhra Pradesh-TeluguStop.com

లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి.చేతికి అందిన పంటలు నష్టాలు పాలవుతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో తుఫాను రాబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అయితే ఈ తుఫాను ఉత్తర ఒడిశా.

పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది.ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

ఇది పశ్చిమ వాయువ్య అతిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా ఆ తర్వాత 48 గంటల తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.ఈ క్రమంలో తొలిత “ఆంధ్ర- ఒడిశా” మధ్య తీరం దాటవచ్చని భావించిన గాని తీరం వైపు వచ్చిన మధ్యలో దిశ మార్చుకొని “ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్” వైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

కానీ దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube