ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వజ్రం...ఎవరిని వరించనుందో..?!

వజ్రం విలువ చెప్పలేనిది.అది మట్టిలో ఉన్నా సరే లేక చెత్త కుప్పలో ఉన్నా దాని విలువ తగ్గదనేది మరోసారి రుజువైంది.

 World Purest Yellow Diamond The Golden Canary Diamond Auction Details ,biggest D-TeluguStop.com

గోల్డెన్‌ కనరీ వజ్రానికి ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన డైమండ్ గా పేరుంది.అంతటి ఖరీదైన వజ్రం తవ్వకాల్లో మట్టిలో బయటపడింది.

ఇదంతా ఓ వజ్రాల మైనింగ్ కంపెనీకి చెందిన స్థలంలోనే బయటపడటంతో దాని విలువను గుర్తించారు.ప్రస్తుతానికి దుబాయ్ లో ప్రదర్శనకు ఉంచిన ఆ అత్యంత ఖరీదైన డైమండ్ డిసెంబర్ లో వేలం వేస్తున్నారు.

ఆసక్తి కలిగిన వాళ్లు ఎవరైనా న్యూయార్క్‌లో నిర్వహించబోయే వేలం పాటలో పాల్గొని ఆ స్వచ్ఛమైన గోల్డెన్ కనరీ డైమండ్ ను దక్కించుకోవచ్చు.మరి దాని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

మట్టిలో దొరికిన ఖరీదైన డైమాండ్ మనకు వజ్రాల్లో కోహినూర్ వజ్రం పేరు మాత్రమే బాగా తెలుసు.అది అత్యంత ఖరీదైన, అరుదైన వజ్రం కాబట్టే అత్యంత భద్రంగా ఉంచుతున్నారు.

అయితే దుబాయ్ లాంటి స్వచ్చమైన మరో వజ్రాన్ని గుర్తించారు.ప్రపంచంలోనే వజ్రాల మైనింగ్ చేపట్టే ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ 1980లో కాంగో దేశంలో తవ్విన గనికి సంబందించిన తవ్వకాలు జరిపిన మట్టిలో ఈ పసుపు రంగు వజ్రం బయటపడింది.

ప్రపంచంలోకెల్లా నాలుగోవ అతిపెద్ద వజ్రం ఇదే కావడం విశేషం.డిసెంబర్ వేలం గోల్డెన్ కనరీ వజ్రంగా పిలవబడే ఈ వజ్రం బరువు 303.1 క్యారెట్లు ఉంది.ప్రస్తుతం దీనిని దుబాయ్ లోని సోత్ బీ వేలం శాలలో ప్రదర్శనకు దీనిని ఉంచారు.

Telugu Biggest Diamond, Dubai, Goldencanary, Latest, York, Purestyellow-Latest N

2022, డిసెంబర్ 7న న్యూయార్క్‌లోని సోత్ బీ ఆక్షన్‌లో గోల్డెన్ కనరీ వజ్రాన్ని వేలానికి తీసుకురానున్నారు.ఈ ప్యూర్ డైమండ్ మినిమం ప్రైస్‌ను రూ.123 కోట్లుగా ఆల్రెడీ ప్రకటించారు.కాంగోలో మట్టి తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ ఖరీదైన డైమండ్ బయటపడింది.

దీని వెయిట్ 890 క్యారెట్లు ఉండటం విశేషం.నాలుగు దశాబ్దాల కాలంలో చాలామంది ఈ వజ్రాన్ని షార్ప్‌గా చేయడం వల్ల అది కొంచెం బరువు కోల్పోయిందని వేలం నిర్వాహకులు పేర్కొన్నారు.

మరి ఈ ప్యూర్, ఎక్స్‌పెన్సివ్ డైమండ్‌ను ఎవరు చేజిక్కించుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube