మంచు విష్ణు ఈసారి ఎలాగైనా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ద్వారా సాలిడ్ హిడ్ అందుకునే ప్రయత్నంలో మంచు విష్ణు ఉన్నారు.ఈ క్రమంలోనే మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడవ్వాలన్న ఉద్దేశంతో ఈయన ఈ సినిమా విజయం కోసం యాదాద్రి నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు తెలుస్తోంది.
బుధవారం ఈయన యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించారు.సినీ రచయిత కోన వెంకట్ తో కలిసి ఈయన స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను చేశారు.
ఇక ఈ సినిమా మంచి విజయం అందుకుంటే మంచు విష్ణు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు విష్ణు వెల్లడించారు.ఇక చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈయన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
![Telugu Ishaan Surya, Jinnah, Jinnahs Victory, Manchu Vishnu, Payal Rajput, Worsh Telugu Ishaan Surya, Jinnah, Jinnahs Victory, Manchu Vishnu, Payal Rajput, Worsh]( https://telugustop.com/wp-content/uploads/2022/10/Payal-Rajput-Sunny-Leone-Jinnah-movie.jpg)
ఈ సినిమా 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తప్పకుండా ప్రేక్షకులను సందడి చేస్తుందని ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అంటూ విష్ణు ధీమా వ్యక్తం చేశారు.మరి విష్ణు అనుకున్న విధంగానే ఈ సినిమా తనకు మంచి సక్సెస్ వస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే 21వ తేదీ వరకు వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.మరి ఈ సినిమాతో విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.