ఈ ఏడాది సంక్రాంతికి అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల అయ్యింది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా తర్వాత అనీల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్ని చేయాలని భావించాడు.కాని వెంకటేష్ మరియు వరుణ్ తేజ్‌లు ఖాళీగా లేరు.
వచ్చే ఏడాదిలో ఎప్పటి వరకు వారిద్దరు ఖాళీ అయ్యేది చెప్పలేని పరిస్థితి.అందుకే మరో స్క్రిప్ట్‌ను ఈయన రెడీ చేస్తున్నాడట.
ఎఫ్ 3 చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వబోతున్న నేపథ్యంలో ఒక యంగ్ హీరోతో మీడియం బడ్జెట్‌తో ఒక సినిమాను రూపొందించబోతున్నాడు.వచ్చే ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఒక సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న దర్శకుడు కొత్త హీరోతో సినిమాకు కమిట్ అయ్యాడు.
ఆ తర్వాత ఎఫ్ 3 చిత్రంను తీయాలని భావిస్తున్నాడట.మొత్తానికి ప్లాన్ బి అన్నట్లుగా అనీల్ రావిపూడి కొత్త హీరో సినిమాను చేయడం మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

సినిమా షూటింగ్స్ లేకపోవడంతో వెబ్ సిరీస్ కు సలహాలు సూచనలు చేయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.ఒక వైపు కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ను చేయాలని భావిస్తున్నాడు.మొత్తానికి ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా అనీల్ రావిపూడి బిజీ బిజీగా ఉండటం చూసి ఆయన్ను మామూలోడు కాదంటూ ఇండస్ట్రీ వారు అంటున్నారట.