టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Choreographer Jani Master ) లైంగిక వేధింపులకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
కాగా ఇప్పటికే జానీ మాస్టర్ పై చాలా రకాల లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్ లకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు( Narsingi Police ) జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.కాగా జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో( Film Chamber ) పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.బాధితురాలికి న్యాయం జరగాలంటూ కోరుతున్నారు.
తాజాగా ఈ కేసుపై స్టార్ యాంకర్ అనసూయ( Anasuya ) సైతం స్పందించింది.బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆమె లేడీ కొరియోగ్రాఫర్ కు( Lady Choreographer ) న్యాయం జరగాలని కోరింది.
అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి.మహిళలకు సానుభూతి అవసరం లేదు.
అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి.మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి.
మీకు అందరూ అండగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు.

నేను బాధిత యువతితో కలిసి కొద్ది రోజులు వర్క్ చేశాను.పుష్ప( Pushpa ) సెట్స్ లో రెండు, మూడుసార్లు ఆ అమ్మాయిని చూశాను.కానీ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచి పెట్టింది.
ఆ అమ్మాయికి మంచి ట్యాలెంట్ ఉంది.ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి ట్యాలెంట్ ను ఏ మాత్రం తగ్గించలేవు.
కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు.నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తాను.
వారికి మద్దతుగా నిలబడుతాను.ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను.
ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను అని అనసూయ తెలిపింది.
ఈ మేరకు అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలామంది అనసూయకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.