సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలోను, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ తుగ్లక్ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా విఫలయ్యారు.వ్యవసాయానికి ప్రభుత్వం ఇస్తున్న సాయం కొరకు ప్రభుత్వం చెపుతున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది.
నేడు కోస్తా జిల్లాలలో క్రాఫ్ట్ హాలిడే రైతులు ప్రకటించారు.రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయింది.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల పంట దెబ్బతింది.చెరకు రైతులకు పేమెంట్లు ఇవ్వడంలేదు.
రైతులు అమ్మిన దాన్యానికి కుడా డబ్బులు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యలు పెరిగాయి.
ఇది చాలదన్నట్లు మోటర్లకు మీటర్లు పెడుతున్నారు.ఇది రైతు ప్రభుత్వమా.? రైతు దగా ప్రభుత్వమా.?.రైతు భరోసా కేంద్రంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.13,500/- ఇస్తానని చెప్పి, ఇప్పుడు రూ.7,500/- మాత్రమే ఇవ్వడంతో ఒక్కో రైతు సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున 5 సం.లలో రూ.30 వేలు నష్టపోతున్నారు.ఇది రైతు ప్రభుత్వమా.? రైతు దగా ప్రభుత్వమా?.64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి, నేడు కేవలం 45 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా కుదించడం ఇది రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.15లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి, కేవలం 49 వేల మందికి మాత్రమే రైతు భరోసా అందించడం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.నెలల తరబడి ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం, కౌలు రైతులు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ఉండటం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.
చంద్రబాబు హయంలో 50 నుంచి 70 శాతంతో సబ్సిడీ వ్యవసాయ యాంత్రికరణ చేస్తే, నేడు మీ రెండున్నర సంవత్సరాలలో సబ్సిడీపై ఒక వరినాటు యంత్రం, ఒక వరికోత యంత్రం, ఒక ట్రాక్టర్, ఒక ఆయిల్ ఇంజిన్, ఆఖరికి ఒక బరకం ముక్క కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.చంద్రబాబు హయంలో 90% సబ్సిడీతో మెట్ట ప్రాంత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే నేడు ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక్క శాతం కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.గుజరాత్ రాష్ట్ర అమూల్ డైయిరీకి పాలు పోస్తేనే సంక్షేమ పధకాలు ఇస్తామంటూ రైతులను బెదిరిస్తూ, రాష్ట్రంలోని రైతుల సహకార సంఘ పాల డైయిరీలను నిర్వీర్యం చేసే ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లు అంచనాలను కేంద్రంతో ఆమోదించుకోలేక, పునరావాస ప్యాకేజి తగ్గించుకోవడానికి పోలవరం నీటి సామర్ద్యము ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించే ప్రణాళిక వేసుకొని పోలవరం అర్ధం, పరమార్ధం మార్చడం ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?.అన్ని జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పోలిస్తే సగానికి సగం బడ్జెట్ ఖర్చు కోతకోయడం రైతు దగా కాదా?.దయవుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయగలరు.