పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) సినిమాల లైంప చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే.బాహుబలి ముందు వరకు ప్రభాస్ కేవలం సౌత్ హీరో ఇంకా చెప్పాలంటే ఒక తెలుగు హీరో మాత్రమే ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు.
ఆ తర్వాత కూడా అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం ఆదిపురుష్( Adipurush ), సలార్, ప్రాజెక్ట్ కె ఈ మూడు సినిమాలు వరుస రిలీజ్ లు ప్లాన్ చేశాడు ప్రభాస్.
అయితే పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ లైనప్కి పోటీగా మరో తెలుగు స్టార్ రెడీ అవుతున్నాడు అతనెవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమాల రేంజ్ ఈక్వెల్ ప్లానింగ్ తో అల్లు అర్జున్( Allu Arjun ) సినిమాల లైనప్ ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత అసలైతే సందీప్ వంగాతో సినిమా ఉన్నా దానికన్నా ముందు హిట్ కాంబో త్రివిక్రం తో సినిమా చేస్తాడట.ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత సందీప్ వంగ తో మూవీ.ఆ ప్రాజెక్ట్ కి ఆకాశమే హద్దు అనేలా ప్లానింగ్ ఉందట.
ఆ తర్వాత బాలీవుడ్ మేకర్స్ తో అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి.ఇలా ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులతో అల్లు అర్జున్ సినిమాలు కూడా పోటీ పడబోతున్నాయని తెలుస్తుంది.